ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిందని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చెప్పారు. కాగా, ఇవాళ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో రాజీపడ్డారని వస్తున్న వార్తలను ఖండించారు. అసలు చంద్రబాబు తనపై ఉన్న కేసుల్లో నిర్దోషిగా.. క్లీన్ చిట్‌తో బయటకు వచ్చారన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్యేలను గాలికొదిలేసి రోడ్లపై తిరుగుతున్నారన్నారు. జగన్ లాలూచీ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ దేశంలో ఉండే సీనియర్, విజన్‌గల నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడేనని పేర్కొన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
see also : పవన్ కల్యాణ్‌పై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..!!
see also : కేఈ శ్యాంబాబుపై హైకోర్టు సీరియస్..!!
see also : బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ ముచ్చటగా మరో ఛార్జ్‌షీట్ ఫైల్ చేసిందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై సీబీఐ 11 కేసులను ఫైల్ చేయగా.. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కలిసి 14 ఛార్జ్‌షీట్‌లను ఫైల్ చేసిందన్నారు. ఇందూటెక్ కంపెనీకి సంబంధించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో 250 ఎకరాల భూమిని కేటాయించినందుకుగాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిక కంపెనీల్లో రూ.250 కోట్లును పెట్టుబడులుగా పెట్టాలని డిమాండ్ చేశారన్నారు. వీటన్నింటిని సీబీఐ ఆధారాలతో సహా విచారించిందని, త్వరలో వైఎస్ జగన్‌పై సీబీఐ కేసులు పెట్టడం ఖాయమని తేల్చి చెప్పారు మంత్రి సోమిరెడ్డి.