ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ ప్రతిపక్షంలో ఉండటం వల్ల జగన్ ఇప్పటికే అనేక సెగ్మెంట్లలో నియోజకవర్గ ఇంచార్జ్ లను నియమించారు. వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఫిక్స్ చేశారు. అయితే టీడీపీలో మాత్రం ఇప్పుడు ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.. అంతపురం జిల్లా అంటే 2014 లో తెలుగుదేశం అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో ఇక్కడ పార్టీ మంచిఫామ్ లోఉంది అనే పేరు తెచ్చుకుంది.. కాని ఎన్నికల్లో గెలిచిన తర్వాత పరిస్దితి దీనికి భిన్నంగా మారింది. ఇప్పుడు ఇక్కడ జిల్లా నుంచి తెలుగుదేశం తరపున ఉన్న 5 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదు అనే సమచారం.
see also;ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
శింగనమలలో ఎంఎస్ రాజు పార్టీలో చేరడం, దీని వెనుక మంత్రి కాలవ శ్రీనివాసులు చొరవ ఉంది అనే వార్త అక్కడ సిట్టింగ్ నాయకులకు కాస్త కాకపుట్టించింది. అలాగే జిల్లాలో మంత్రి కాలవ శ్రీనివాసులు హవా నడుస్తోంది అని, జేసి వర్గంతో కలిసి ముందుకు వెళుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక శింగనమల ఎమ్మెల్యే విప్ యామినీబాల తాజా పరిస్దితులపై మండిపడుతున్నారు.. సిటింగ్ ఎమ్మెల్యేలకు పొగపెడుతున్నారా అని ఆమె ఫైర్ అవుతున్నారు.ఇక కల్యాణ దుర్గం పేరు చెబితే రాజకీయ కురు వృద్దుడు హనుమంతరాయ చౌదరి గుర్తువస్తారు.. ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కల్యాణ దుర్గంలో.. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు కాకుండా ఆయన కుమారుడు లేదా కోడలికి సీటు ఇచ్చే అవకాశం ఉంది అని కల్యాణ దుర్గంలో చర్చించుకుంటున్నారు ప్రజలు…ఈ ప్రాంతంలో కీలక నాయకుడు బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరావుకు టిక్కెట్టు ఇప్పించాలని ఓ సీనియర్ నేత రాయబారం కూడా చేస్తున్నారట.
see also;బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన అప్పిలేట్ ట్రిబ్యునల్..!!
అలాగే జిల్లాలో జేసి తెలుగుదేశంలోకి వైసీపీ నుంచి పార్టీ మారారు. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి.. ఆయన కూడా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి మంట పుట్టించేలా వ్యవహారిస్తే తన పరిస్దితి ఏమిటి అని ప్రభాకర చౌదరి ఆలోచిస్తున్నారు.. ఇక జేసి వెనుక ఉండి తెరవెనుక రాజకీయం చేసే ఆవశ్యకత కూడా ఉంటుంది అని ఆయన మదనపడుతున్నారు.. అయితే గురునాథరెడ్డి పార్టీలో చేరే సమయంలోనే బాబు మాట ఇచ్చారట.. అందుకే ప్రభాకర్ చౌదరి రాజకీయంగా ముందుకు వెళుతున్నారని, ఆయన కేడర్ ను కూడా చెదిరిపోకుండా చూసుకుంటున్నారు అని అంటున్నారు నాయకులు.
see also..బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
ఇక ప్రత్యేక రైల్వే జోన్ కావాలి అని ప్రశ్నిస్తున్న ప్రాంతం గుంతకల్లు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జితేంద్రగౌడ్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం రెడీగా లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి..ఇక అలాగే గుంతకల్లు నుంచి మంత్రి కాలవశ్రీనివాసులు కూడా పోటీచేసే యోచనలో ఉన్నారు అని తెలుస్తోంది.. ఆయన సెగ్మెంట్ మారాలి అని ఆలోచిస్తున్నారు… ఇక రెండవ టర్మ్ లో మంత్రి పదవి పోగొట్టుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి కూడా తనకు టికెట్ వస్తుందా లేదా అనే డైలమాలో ఉన్నారు.. అయితే ఇక్కడ సీనియర్ గా ఉండటం పలు సామాజిక కారణాలతో ఆయనకు సీటు పక్కా అనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తాడిపత్రిలో జేసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి ఎంట్రీ ఇస్తారు అని, ఎంపీగా జేసి పవన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు అని చర్చలు జరుగుతున్నాయి అనంతపురంలో.. అయితే ఈ సిటింగ్ ఎమ్మెల్యేలు ఉంటారా, యూ టర్న్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి కాలమే నిర్ణయించాలి.