తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు.
see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?
రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేద న్నారు.రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా పోయిందని, ప్రజల్లో ఏర్పడిన అసంతృప్తి ప్రజాయాత్ర సందర్భంగా తమ దృష్టికి వస్తోందన్నారు.కాంగ్రెస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ యాత్రను చేపట్టామని వివరించారు.ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు గురించి ఇప్పుడే ఏమి చెప్పలేమని, రాబోయే మూడు, నాలుగు నెలల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ వెల్లడించారు.