తెలంగాణ బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే జి కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే నిజంగా కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..?.పూవును విడిచి కారు ఎక్కనున్నారా ..?.అనే వార్తలపై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు సమాచారం.
see also :ఆందోళనలో చంద్రబాబు..!
ఆయన మీడియాతో మాట్లాడుతూ “తను బీజేపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్నా వార్తలు నిజమే.అయితే తనని పార్టీ అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుండి పార్టీలో సముచిత ప్రాధాన్యత ఇవ్వడంలేదు.అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గం నుండి ఎంపీగా పోటి చేస్తాను అని ఇటు రాష్ట్ర అటు జాతీయ పార్టీ అధిష్టానానికి తెలియజేసిన కానీ ఎటువంటి స్పందన లేదు.
see also : ప్రముఖ నటిని భరితెగించిన ఆడది.. వ్యభిచారి అంటున్నారంట..
అయితే తన రాజకీయ భవిష్యత్తుకోసం తీసుకునే నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి ఉంటుంది.అయితే తను తీసుకునే నిర్ణయం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేస్తుందా లేదా అనే అంశం మీద ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు.అయితే కిషన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం జాతీయ అధిష్టానం ఎంపీగా బరిలోకి దింపడం కష్టమే ..అందుకే తన రాజకీయ భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితుల బట్టి ఉందని చెప్పడం వెనక ఆయన పార్టీ మారడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు ..
see also :టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు