ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ,అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ వస్తుంటారు.ఉన్నది ఉన్నట్లు మొహం మీదనే చెప్తారు.ఒకానొక సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మీద పొగడ్తల వర్షం కురిపిస్తారు.ఒకానొక సమయంలో విమర్శల వర్షం కురిపిస్తారు.
see also : జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
తాజాగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ ప్రత్యేక హోదా.గత నాలుగు ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తోన్న పోరాటాలు ,ఉద్యమాల ఫలితంగా ప్రత్యేక హోదా ప్రజల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఇంకా సజీవంగా ఉందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యేక హోదా వస్తే ఆ క్రెడిట్ వైసీపీకే దక్కుతుందని కూడా టాక్.అయితే ఈ నేపథ్యంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు ఏండ్లుగా ప్రజల కోసం ఎన్నో అవమానాలను భరించాం.
see also :రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..?
కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవమానాలను గురిచేసిన కానీ బాబుకు సహనం ఎక్కువ కాబట్టి ఓపిక పట్టాం.ఇక మాకు ఓపిక నశించింది.బాబు అవును అన్న కాదన్న కానీ కేంద్రం నుండి తమ పార్టీ బయటకు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకవైపు బీజేపీ నేతలపై ,కేంద్ర సర్కారుపై ఎటువంటి విమర్శలు చేయద్దు అని బాబు సూచిస్తున్న తరుణంలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇలా ప్రకటించడం బాబును మంచి ఇరకాటంలో పడేసినట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.