వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తోన్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతుంది.ఈ పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాలు విసిరారు.
See Also:సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!
రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మొత్తం అరవై ఏడు మంది ఎమ్మెల్యేలను గెలుపొందింది.ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన తాయిలాలకు ఆశపడి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరారు.ఈ క్రమంలో పాదయాత్రలో భాగంగా ఇంకొల్లు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ దమ్ముంటే ఇరవై ముప్పై కోట్లు పెట్టి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనడం కాదు.
See Also:జగన్ వేసిన ప్లాన్ కు బాబుకు చుక్కలే ..!
మగాడిలా సవాలు చేస్తున్న స్వీకరించు బాబు ..నీకు నీతి నీజాయితీ దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ,ఎంపీల చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రా..నేను ఎన్ని గెలుస్తానో..నువ్వు ఎన్ని గెలుస్తావో తేల్చుకుందాం ..అధికారం ఉందని ..మీడియా బలముందని కోట్లు కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను ,ఎంపీలను కొనడం కాదు దమ్ముంటే రాజీనామా చేయించాలని ..నేను కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి చేత రాజీనామా చేయించి మగాడిలా పార్టీలో చేర్చుకున్న ..మీకు దమ్ముందా ..సవాలు స్వీకరించండి అని బహిరంగంగా బాబుపై విరుచుకుపడ్డారు జగన్ ..