Home / ANDHRAPRADESH / 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రీపోల్ సర్వే : టీడీపీ..? వైసీపీ..? కాంగ్రెస్‌..? జ‌న‌సేన‌..?

2019లో జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో ప్రీపోల్ సర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే, ఏపీలో అధికార‌పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ నాలుగు పార్టీల్లో ప్ర‌ధానంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య‌నే హోరా హోరీ పోరు సాగ‌నుంది.

see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత

see also : భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..

ఇదిలా ఉండ‌గా.., ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు సంస్థ‌లు చేసిన స‌ర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూప‌గా.. తాజాగా ప్రీ పోల్ స‌ర్వేలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌కేన‌ని తేల్చి చెప్పింది. అధికార పార్టీ టీడీపీ ప్ర‌జ‌ల వ్య‌తిరేక‌త‌తో ద్వితీయ స్థానంతో స‌రిపెట్టుకుంది. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లుకాని, మోస‌పూరిత హామీలు ఇచ్చి గ‌ద్దెనెక్కిన చంద్ర‌బాబు.. త‌న‌మీద ఉన్న కేసుల‌కు భ‌య‌ప‌డి కేంద్రంతో క‌లిసి ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నేప‌థ్యంలో టీడీపీ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర వ్య‌తిరేక‌త చూపుతున్నారు. మ‌రోప‌క్క రాష్ట్రాన్ని అడ్డ‌గోలుగా విభ‌జించిన కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు నుంచి తీవ్ర నిరాశే మిగిలింది. ఇక జ‌న‌సేన గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యాలు, నిల‌క‌డ‌గ‌ల నిర్ణ‌యాలు తీసుకోని అధినాయ‌క‌త్వంపై జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తోపాటు ప్ర‌జ‌లు తీవ్ర విముఖ‌త చూపుతున్నారు. అయితే, ప‌లు అసెంబ్లీ స్థానాల్లో జ‌న‌సేన ప‌ట్టు సాధించేందుకు అవ‌కాశం ఉంద‌ని ప్రీ పోల్ స‌ర్వే తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ మొత్తం సీట్లు – 175

శ్రీకాకుళం మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 5
జనసేన : 1
కాంగ్రెస్ : 0
విజయనగరం మొత్తం సీట్లు 9 కాగా , అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 5
జనసేన : 2
కాంగ్రెస్ : 0

విశాఖపట్నం మొత్తం సీట్లు 15కాగా, అందులో..
టీడీపీ : 6
వైస్సార్సీపీ : 8
జనసేన : 1
కాంగ్రెస్ : 0

తూర్పుగోదావరి మొత్తం సీట్లు 19 కాగా, అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 9
జనసేన : 8
కాంగ్రెస్ : 0

పశ్చిమగోదావరి మొత్తం సీట్లు 15కాగా, అందులో..
టీడీపీ : 5
వైస్సార్సీపీ : 5
జనసేన : 5
కాంగ్రెస్ : 0

కృష్ణ మొత్తం సీట్లు 16 కాగా, అందులో ..
టీడీపీ : 5
వైస్సార్సీపీ : 11
జనసేన : 0
కాంగ్రెస్ : 0

గుంటూరు మొత్తం సీట్లు 17 కాగా, అందులో..
టీడీపీ : 10
వైస్సార్సీపీ : 7
జనసేన : 0
కాంగ్రెస్ : 0

.ప్రకాశం మొత్తం సీట్లు 12 కాగా, అందులో..
టీడీపీ : 3
వైస్సార్సీపీ : 8
జనసేన : 1
కాంగ్రెస్ : 0

నెల్లూరు మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 2
వైస్సార్సీపీ : 7
జనసేన : 1
కాంగ్రెస్ : 0

కడప మొత్తం సీట్లు 10కాగా, అందులో..
టీడీపీ : 0
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0

కర్నూల్ మొత్తం సీట్లు 14 కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0

అనంతపురం మొత్తం సీట్లు 14కాగా, అందులో..
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0

చిత్తూర్ మొత్తం సీట్లు 14కాగా, అందులో
టీడీపీ : 4
వైస్సార్సీపీ : 10
జనసేన : 0
కాంగ్రెస్ : 0

 

మొత్తంశాస‌న‌స‌భ స్థానాలు :- 175

టీడీపీ : 51
వైస్సార్సీపీ : 105
జనసేన : 19
కాంగ్రెస్ : 0

ఇప్పుడీ ప్రీ పోల్ స‌ర్వే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ కాబోయే సీఎం అంటూ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. పై ఫ‌లితాలు వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా రావ‌డానికి కార‌ణాలు లేక‌పోలేదు. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త‌, అలాగే, ప్ర‌త్యేక హోదా అంశంపై ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడిలా పోరాడుతూ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్య‌న ఉంటున్న జ‌గ‌న్‌కు.. ప్ర‌జాదార‌ణ పెరిగింద‌ని ప్రీ పోల్ స‌ర్వేలో తేలిన‌ట్లు స‌మాచారం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat