ఏపీలో టీడీపీ నేతలు ఎంత దారుణంగా రౌడీయిజం ఎలా చేస్తున్నారో ప్రత్యక్ష సాక్ష్యం సోమవారం కర్నూల్ జిల్లా నంద్యాల్లో ఘటన. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయలంటూ ధర్నా చేస్తున్న న్యాయవాదులపై నంద్యాలలో టీడీపీ నేత మేనల్లుడు దాడికి తెగబడ్డారు. చెప్పు కాళ్లతో న్యాయవాదులను తన్నాడు. అంతటితో ఆగకుండా ధర్నా ప్రాంతంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను ఎగిరి బూట్‌కాలితో తన్నాడు.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ గత 40రోజులుగా నంద్యాలలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సోమవారం మహాదీక్ష శిబిరం వద్దకు పలు ప్రజా సంఘాల, అఖిలపక్ష పార్టీల నాయకులు వచ్చి సంఘీభావం తెలిపారు. వందలాది మంది శిబిరం వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో నూనెపల్లె వైపు నుంచి శ్రీనివాససెంటర్ వైపు కారులో వెళ్తున్న స్థానిక టీడీపీ కౌన్సిలర్ వాకాశివశంకర్‌యాదవ్ మేనల్లుడు వేణు యాదవ్ కారు కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది.
దీంతో సహనం కోల్పోయిన వేణు యాదవ్ కారు దిగి వచ్చి లాయర్లను పచ్చిబూతులు తిడుతూ రెచ్చిపోయారు.మీరు చేసే ఆందోళన వల్ల ఏంట్రా ఉపయోగం అంటూ విరుచుకుపడ్డారు. శిబిరం వద్ద ఏర్పాటు చేసిన న్యాయదేవత బొమ్మను చెప్పు కాలితో తన్ని కిందపడేశారు. దీక్షలో ఉన్న న్యాయవాదులు అడ్డుకునేందుకు వస్తున్న వారిపైనా ఆ సమయంలో దాడికి దిగాడు. ఇద్దరు లాయర్లను చెప్పు కాలితో కిందపడేలా తన్నాడు. వేణుయాదవ్‌తో పాటు వచ్చిన మహిళలు కూడా లాయర్లపై భౌతికదాడికి దిగారు. న్యాయదేవతను చెప్పు కాలితో తన్ని, లాయర్లపై దాడి చేసిన వేణుయాదవ్‌పై టూటౌన్ పీఎస్‌లో బార్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది