తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ,విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రగతి సభ లో మంత్రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రగతి సభలో మంత్రి ప్రసంగిస్తూ..వచ్చే ఎన్నికల్లో కోదాడ నుంచే టీఆర్‌ఎస్ పార్టీ విజయ యాత్ర ప్రారంభమవుతుందని అన్నారు.తెలంగాణ రాష్ర్టానికే ముఖద్వారం కోదాడ. 2019 ఎన్నికల్లో కోదాడలో గులాబీ జెండా ఎగరాలన్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న నోళ్లు మూతపడేలా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నరని తెలిపారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కాంగ్రెస్ 50 ఏళ్లు అధికారంలో ఉన్నా ఫ్లోరైడ్ సమస్యను పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలిసేది కాదు. రాష్ట్రంలో అర్హులందరికీ సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్లినట్టుగా ఉందని ఎద్దేవచేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేని నాయకులు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నరని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ను ఇంటి దారి పట్టించాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో ఇచ్చే బియ్యంలో సీలింగ్ విధించారు. అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దని కొనియాడారు. కోదాడకు రెండు దఫాలుగా రూ. 50 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. కోదాడలో 1,400 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ ప్రారంభమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సభలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.