రాష్ట్ర విభజనతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల్లో చేరారు కూడాను.
ఆ విషయం అటుంచితే.. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియక అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాత్రం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వైఎస్ జగన్ అంటే తనకు, తన మామకు ఎనలేని ఇష్టమని, తన మామ వైఎస్ జగన్‌ను కలిపించాలని తనను ఎప్పుడు అడుగుతుంటాడని, వైఎస్ జగన్ పాదయాత్ర వైజాగ్‌కు చేరుకోగానే తన మామను జగన్‌తో కలిపిస్తానని చెప్పిన మాటలు విధితమే. అంతేగాక… ఇటీవల కాలంలో మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ కూడా వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై ప్రశంసల వర్షం కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరువాత జగన్ వల్లే సాధ్యమైందని తెలిపారు. ఇలా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైఎస్ జగన్‌పై తమకున్న అభిమానాన్ని ఒక్కొక్కరిగా మీడియా సాక్షిగా బయటపెడుతున్నారు.
see also : నంద్యాలలో న్యాయదేవతను చెప్పు కాలితో తన్నిన టీడీపీ నేత
see also : భార్య అక్రమ సంబంధం భర్తకు తెలిసింది..కాని కొడుకును ఎందుకు హత్య చేశారంటే..
ఇదిలా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ వైసీపీలో చేరబోతున్నారా..? అంటే అవునననే సమాధానం ఇస్తోంది ఓ ప్రముఖ దిన పత్రిక. ఇందుకు సంబంధించి కూడా ఆ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, కాంగ్రెస్ నేత హర్సకుమార్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలో 2004, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. 2014 రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్‌మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతవల్ల హర్షకుమార్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరేందుకు హర్సకుమార్ సిద్ధమయ్యారని, ఆ మేరకు వైసీపీ నేతలతో హర్షకుమార్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.