తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడానికి, రైతు పండించిన పంటకు లాభసాటి ధర అందడానికి, మాటలతో కాకుండా చేతలతో తెలంగాణ రైతుల ఆధాయాన్ని రెట్టింపు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు.
see also :ఒక్క మహిళ..ఒకేసారి ఇద్దరితో అక్రమ సంబంధం..ఇంట్లోనే ఎంజాయ్..!
రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు విది విదానాల రూపకల్పనకై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఈ రోజు సచివాలయంలోని డి బ్లాక్ లో సమావేశమైంది. కమిటి సభ్యులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ , నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశానంతరం కమిటీ చైర్మన్ మంత్రి పొచారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతాలకు అనుగుణంగా పండే పంటల విస్తీర్ణం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశ్రమలు, నూతనంగా అవసరమయ్యే పరిశ్రమలపై చర్చ జరిగిందన్నారు. తదుపరి సంబందిత శాఖల అధికారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీ పార్ధసారధి గారితో సమావేశమయ్యు సలహాలు, సూచనలను అందిస్తారు.
see also :ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
జిల్లాల వారిగా పంటల బై ప్రొడక్ట్స్ పై కూడా సమాచారం సేకరిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఉద్యేశం రైతులకు తాము పండించిన పంటకు లాభసాటి ధరను పొందామనే ఆనందం కలగాలి. పండించిన పంటకు తృప్తికరమైన ధర పొందాలి. అంతేకాని ఎదో పండించాను, కొనేవారు లేరు నాఖర్మకు ఇంతే అనే ధుఃఖం రైతుల మొహంలో చూడకూడదు. వ్యవసాయ రంగం పటిష్టం కోసం 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా, రాబోవు కొద్దిరోజుల్లో రెండు పంటలకు సాగునీరు, వచ్చే వానాకాలం నుండే ముందస్తు పెట్టుబడికై ఎకరాకు రూ. 8000 అందించడం జరుగుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ రైతులు ఆనందంగా పంటలు పండించడమే కాదు, పండించిన పంటకు మంచి ధర వచ్చే విదంగా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా ఇతర ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతులు చేసి రైతులకు మంచి ధరలు వచ్చే విదంగా విదానాలను రూపొందించడమే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ఉద్యేశం. ఈ నెల 15న రెండవసారి సమావేశమవుతాం. తుదుపరి విదివాదానాలు ఖరారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నివేదిక అందజేసి క్యాబినెట్ అనుమతి తీసుకుంటామన్నారు.
see also :రూ.7 కోట్లతో సీఎం కేసీఆర్ కి బుల్లెట్ ప్రూఫ్ బస్సు..!
ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయ రంగం, రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు లేరు. వారి ఖర్మన వారిని వదిలేశారు. కాని తెలంగాణ రాష్ట్రం వచ్చాక, TRS ప్రభుత్వం ఏర్పాటయ్యాక స్వయంగా రైతు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి రైతుల సాదకబాధలు తెలుసు కాబట్టి, రైతు శక్తిని, రైతు ఆత్మగౌరవాన్ని పెంచి, పంటలకు లాభసాటి ధరలను కల్పించాలనే ఉద్యేశంతో దేశంలోనే మొదటిసారిగా రైతుల కోసం శ్రద్ద తీసుకుంటున్నారు. మున్ముందు కూడా తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రగామి కాబోతుందన్నారు.