ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అదిరిపోయే షాకిచ్చారు.అయితే ఇప్పటికే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను దెబ్బ కొట్టాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే చంద్రబాబు ఎత్తులేస్తూ ఉంటే జగన్ చూస్తూ కూర్చోడుగా.. దీంతో ఈ ఎత్తులు, పై ఎత్తులతోనే రాజ్యసభ ఎన్నికలు రంజుగా జరగటం ఖాయంగా తెలుస్తోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.., రాష్ట్రంలో భర్తీ అవనున్న 3 స్ధానాల్లో టీడీపీకి 2, వైసీపీకి ఒక స్ధానం దక్కుతుంది. ఎమ్మెల్యేల సంఖ్య, రాజ్యసభ స్ధానాల భర్తీ ప్రకారం ఒక్కో స్ధానానికి 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి.
See Also:వైసీపీలోకి భారీగా వలసలు..!
ఈ లెక్కన టీడీపీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేలతో రెండు స్ధానాలు ఖాయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోను వైసీపీకి ప్రస్తుతం 44 మంది ఎమ్మెల్యేల బలముంది. అంటే ఒక్క ఎమ్మెల్యే జారిపోయినా వైసీపీకి రాజ్యసభ స్ధానం దక్కదు.వైసీపీ నుండి ఎలాగైనా ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కోవాలని టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే టీడీపీలో ఒక వార్త కలకలం రేపుతోంది. అదేంటంటే, వైసీపీ నుండి టీడీపీలోకి ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేల్లో కొందరు తాజాగా వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట. ఈ విషయం బయటకు పొక్కటంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. వైసీపీలో టచ్ లోకి వెళ్ళిన ఫిరాయింపులు ఎవరు అన్న విషయమై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
See Also:Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.!
ఈ మధ్యనే కర్నూలు జిల్లా కోడూరు ఎమ్మెల్యే మణిగాంధి చేసిన ప్రకటన కూడా అందుకూ ఊతమిస్తోంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే జయరాములుతో పాటు తాను కూడా టీడీపీలోకి ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నట్లు చెప్పటం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. తామిద్దరమే కాకుండా ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్వయంగా మణిగాంధి చెప్పటం అప్పట్లో సంచలనం రేపింది. అవే వ్యాఖ్యలను టీడీపీ నేతలు ఇపుడు జాగ్రత్తగా గమనిస్తున్నారు. అంటే వైసీపీలో నుండి ఎమ్మెల్యేలను లాక్కోవాలని టీడీపీ చూస్తోంది. అదే సమయంలో టీడీపీలోకి వెళ్ళిన ఫిరాయింపులతోనే చంద్రబాబును దెబ్బ కొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మొత్తానికి ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుందో ఎన్నికల వరకు ఆగాల్సిందే మరి..!
See Also:”నాడు తండ్రి బాబుకి.. నేడు కుమారుడు లోకేష్ కి” – ముచ్చెమటలు పట్టాయ్..!!