దేశంలో మార్పు తెలంగాణ నుండే మొదలైంది..తెలంగాణే నాయకత్వం వహించి తీరుతుంది అని గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు..త్వరలోనే దేశప్రజల తలరాతను మారుస్తామని చెప్పారు .అవసరమైతే నేను అన్నిటిని దగ్గర ఉండి మరి చూసుకుంటా అని అన్నారు . పదిలక్షల కిలో మీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..నాడు తెలంగాణకై బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలకు గురిచేశారు ..వెనక ఎన్నో మాటలు అన్నారు ..ఈ బక్కోడు తీసుకోస్తాడా అని హేళన చేసారు ..ఏమైంది ఇప్పుడు అని ప్రశ్నించారు .
see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
ఎవరు అవునన్నా..ఎవరు కాదన్నా యావత్తు భారతదేశం బ్రతికేదే రైతాంగం మీద..రైతులేకపోతే దేశ ప్రజలు ఉండేవారా అని ప్రశ్నించారు. సింగపూర్లో కనీసం మన్ను లేదు..డాలర్ రేటు ఎక్కువ.ఇక్కడ అన్ని వనరులున్నా కానీ రోజు రోజుకి రూపాయి విలువ పతనం.ఈ స్థితి మారాలి అని చెప్పారు. ఏ కులమైన ..ఏ మతమైన దేశమంటే ప్రజలే ..దేశంలో 70వేల TMCనీళ్ళున్నాయి .అవి వాడుకోవడానికి పాలకులకు డెబ్బై ఏళ్ళు సరిపోలేదు అని..హిమాలయాల అవతల ఉన్న చైనా మారింది ..ఇవతల ఉన్న ఇండియా మారకూడదా .. డెబ్బై ఏండ్లు దేశ ప్రజలను రాజకీయంగా వాడుకున్నారు తప్పా ఏమి చేయలేదన్నారు.ఏమైనా మాట్లాడితే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు ..పిట్ట బెదిరింపులకు కేసీఆర్ భయపడడు..పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో చూశా అని చెప్పారు.దేశంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా ఎందుకు జరగాలని ప్రశ్నించారు.? శనివారం చేసిన వ్యాఖ్యలపై దేశం నలుమూలల నుంచి నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. తమ్ముడు కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నారని మమతా అన్నట్లు తెలిపారు .