ఇటీవల వరుస షాక్‌లు ఎదుర్కుంటున్న తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అఖిలభారత ఈఎస్ఐసీ సభ్యుడు కపిలవాయి దిలీప్‌కుమార్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు.
see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
తన వ్యక్తిగత కారణాలతో తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. కాగా, బీజేపీలోని అంతర్గత రాజకీయాల కారణంగానే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.