ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోసాధన కోసం రోడ్డుపైకి రాకుండా.. కాలయాపన చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ లెక్కలు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు, తన పాట్నర్ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, నిన్న ఏపీ రాజధాని అమరావతి వేదికగా జరిగిన ప్రత్యేక హోదా రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న నటుడు శివాజీ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతీ ఒక్కరూ రోడ్డుపైకి రావాల్సిందేనన్నారు.
see also : సోది చెప్పకు.. అసలు విషయం చూడు..! పవన్ పై శివాజీ ఫైర్..!!
see also : చంద్రబాబు 40ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ..చరిత్రలో చెరగని 40తప్పులు ..!
ప్రత్యేక హోదా కోసం రోడ్డుపైకి వచ్చి పోరాడకుండా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ కార్యక్రమాల కోసం ఫోటో షూట్ లు ఇవ్వడం చూస్తుంటు సీఎం చంద్రబాబు బీజీపీతో కుమ్మక్కైనట్లు.. పవన్ కల్యాణ్ కూడా బీజేపీతో కుమ్మక్కైనట్లు అర్థమవుతోందన్నారు. బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన డ్రామాలాడుతున్నాయన్నారు. అవినీతిని ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కల్యాణ్ కోర్టులో కేసులు న్న చంద్రబాబును ఒక్క మాటకూడా అనకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లలో చంద్రబాబు చేసిన పోరాటం శూన్యమని తేల్చేశారు నటుడు శివాజీ.