ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆప్తుడు ,నమ్మకమైన నాయకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు టీటీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు.గురువారం తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల సమన్వయ సమీక్షా సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
అయితే ఈ భేటీ మోత్కుపల్లి లేకుండానే జరగడం విశేషం.అంతే కాకుండా బాబు ఈ భేటీ సందర్భంగా కొందరు పార్టీ వీలినం అని ఏదో ఏదో అంటున్నారు.అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు.తెలుగు జాతి ఉన్నంతవరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది అని ..పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పరోక్షంగా మోత్కుపల్లికి వార్నింగ్ ఇస్తున్నట్లు మాట్లాడారు.
దీనిపై మోత్కుపల్లి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ దగ్గర ఎంత నిబద్ధతతో పనిచేసానో ..బాబు దగ్గర కూడా ప్రస్తుతం అంతే నిబద్దతతో పని చేస్తున్నాను.బాబుకు నేను తమ్ముడి లెక్క.బాబు కోసం ఒకసారి నేను ఆత్మహత్యకు ప్రయత్నించాను అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే ఉద్యమ సమయంలో బాబుపై అందరు పోరాడుతుంటే నేను మాత్రం బాబుకు అండగా ఉంటూ ..బాబును కాపాడటానికి నేను రాజకీయంగా ఆత్మహత్యకు కూడా సిద్ధమయ్యాను అని ఆయన అన్నారు..