తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఖమ్మంజిల్లా లోని కూసుమంచి మండలంలో పర్యటించారు.పర్యటనలో భాగంగా ఇవాళ కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో అయన మాట్లాడుతూ..వచ్చే ఉగాది నాటికి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇస్తామన్నారు.
see also :చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పార్టనర్‌షిప్‌ను ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!!
భక్తరామదాసు ప్రాజెక్ట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని చెరువులు నిమ్పుతామని అన్నారు.త్వరలోనే రైతులందరికీ పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని తెలిపారు.ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పతకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటి సాధించి మళ్ళి అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి తుమ్మల దీమా వ్యక్తం చేశారు.
see also :ఓ మై గాడ్.. జగన్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్..!