ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో పెనుసంచాలనం చోటు చేసుకోబోతుందా..!.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అక్రమాలు ,అన్యాయాలపై ఇటు ప్రజలే కాకుండా ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులతో సహా కార్యకర్తలు అందరు విసిగిపోయి ఉన్నారా..అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తమకు అధికారం దక్కదని ముందుచూపుతో పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా.అందుకే అధికార పార్టీ అది తమ సొంత నేతలు చేస్తున్న అవినీతి అక్రమాలపై గళమెత్తి మీడియా సాక్షిగా నిజాలను నిక్కసుగా చెబుతున్నారా ..అంటే అవును అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
see also :ఏపీ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి..!
అసలు విషయానికి వస్తే పల్నాడు కి చెందిన మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన రావెల కిశోర్ బాబు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అందుకే తన నియోజక వర్గమైన ప్రత్తిపాడులో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన అనుచరవర్గంతో కల్సి దాదాపు వంద కోట్లకుపైగా అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారు అని మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం గురించి ఇటు స్థానిక జిల్లా కలెక్టర్ ,అటు పార్టీ అధిష్టానానికి తీసుకెళ్ళిన చర్యలు తీసుకోవడంలేదని ఆయన వాపోయారు.
see also :మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి ..!
జిల్లాలో పొత్తూరు శివారు ఓబులునాయుడు పాలెం వద్ద నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ క్యారీలను ఎమ్మెల్యే రావెల పరిశీలించారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ అక్రమ లారీల ద్వారా మంత్రి పుల్లారావు అనుచరవర్గానికి చెందిన నారాయణ స్వామి,అశోక్ అనే వారు ఓబులునాయుడుపాలెం ,పొత్తూరు,నాయుడు పేట,పేరేచర్ల,కైలాసగిరి ప్రాంతాల్లో అక్రమమైనింగ్ కు పాల్పడుతున్నారు అని ఆయన అన్నారు.అయితే గతంలోనే పార్టీ మారడానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిను కలిశారు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా బహిరంగంగానే ఇలా వ్యాఖ్యలు చేయడం ఆయన పార్టీ మారడం ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.అయితే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదన్నదే కాలమే నిర్ణయించాలని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
see also :లక్షా 50 వేల కోట్ల రూపాయల అవినీతిని ఆధారాలతో సహా తేల్చేశారు..!!