నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి …
కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు.
తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ ఎటువంటి తీవ్రమైన ప్రమాదం జరగక్కపోవడం ..అక్కడ ఉన్నవారికి ఎటువంటి హాని జరగక్కపోవడంతో వార్ని ఆప్యాయంగా పలరించి తగిన జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి వారిని పంపించి తిరిగి సిద్దిపేటకు ప్రయాణం అయ్యారు మంత్రి ..తన కారు ముందే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతుంటే చూసి చూడనట్లు వెళ్ళిన నేతలను చూసాం ..
ఆఖరికి తన ఇంటికి వచ్చి అయ్యా ఇది సమస్య అంటే లోపల ఉన్న కానీ బయట నుండి బయటకి పంపించే నేతలను చూసిన మనం తన కారు జెట్ స్పీడ్ లో పోతున్న కానీ ప్రమాదం జరిగిందని తెల్సి తన పీఎలనో ..అధికారులనో పురామయించకుండా తనే స్వయంగా దిగొచ్చి మరి అక్కడి పరిస్థితి తెలుసుకొని వారిని క్షేమంగా పంపించిన నేతను ఇతన్నే చూస్తున్నాం ..అందుకే మంత్రి హరీష్ లాంటి నేతను కల్గి ఉండటం సిద్ది పేట ప్రజలు చేసుకున్న పుణ్యం అని మంత్రిపై ప్రశంసలు కురిపించారు అక్కడ ఉన్నవారు .