ఏపీ సీఎం చంద్రబాబు, తన పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటుడు శివాజీ మరోసారి విరుచుకుపడ్డారు. అయితే, ప్రత్యేక హోదా అంశంపై పవన్ కల్యాణ్ ప్రత్యక్షంగా పోరాడకుండా జేఎఫ్సీ అంటూ వేసిన కమిటీ కాలయాపన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో శివాజీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, జేఎఫ్సీ కమిటీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది..? ఆ నిధులను చంద్రబాబు ఎలా ఖర్చు పెట్టారు..? అన్న లెక్కలు తేల్చేందుకు వేరే పద్ధతి ఉంది. మనకు ఇప్పుడు కావాల్సింది ప్రత్యేక హోదా..! ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా లెక్కలు.. బొక్కలు అంటూ కాలయాపన చేయడం సరికాదని పవన్‌పై ఫైరయ్యారు నటుడు శివాజీ.
see also : చిక్కుల్లో సీబీఐ.. సంతోషంలో వైసీపీ శ్రేణులు..! కారణమిదే..!!
see also : 2019లో హిస్టరీ రిపీట్స్..!! ”ఇది ఫిక్స్”
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం పోరాడుదాం రండి అంటూ రాజకీయ నాయకులకు పిలుపునిస్తున్నారని, కానీ అధికార పార్టీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని పెడచెవిన పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్సీ) వల్ల సాధ్యమయ్యేది ఏమీ లేదని స్పష్టం చేశారు. .. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్రబాబుకు మద్దతు ఇచ్చి తప్పు చేశాడని పేర్కొన్నారు. కేవలం జేఎఫ్సీ ఏర్పాటు చేసినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు.