రైతులు అనారోగ్యానికి గురైనా, అకాలమరణం చెందినా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. రూ.5 లక్షల పరిహారం రైతన్నల సంక్షేమంలో కీలక ముందడగు అని పేర్కొంటూ కేంద్ర మరిన్ని నిర్ణయాలు తీసుకుంటేనే నిజమైన అచ్చేదిన్ అని వివరించారు.
see also :కలెక్టర్ కాబోయి ఎమ్మెల్యే అయ్యాను -చంద్రబాబు..
see also :2019లో హిస్టరీ రిపీట్స్..!! ”ఇది ఫిక్స్”
‘సీఎం కేసీఆర్ రైతు సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. కనీస మద్దతు ధర, పంటల బీమా విషయంలో కేంద్ర ప్రభుత్వం లోపాలను సవరించి మరింత ప్రయోజనకారిగా తీర్చిదిద్దితే…అప్పుడు రైతులకు నిజమైన అచ్చేదిన్ వచ్చినట్లు’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
see also :ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ షాక్ ..!