అన్ని వనరులున్న ఆదిలాబాద్ జిల్లాకు సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని డైట్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులను సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధికి రూ.500కోట్లు ఖర్చు చేస్తున్నామని.. వీటి ద్వారా దాదాపు 20వేల ఎకరాల ఆయుకట్టుకు నీరందించవచ్చన్నారు. కడెం ప్రాజెక్టుకు రూ.870కోట్లు, సాత్నాల ప్రాజెక్టుకు రూ.28కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్‌లో మినీ ఏరో డ్రమ్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దీని ద్వారా 6 నెలల్లో 70వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. దీంతో పాటు బోథ్ నియోజకవర్గంలో రూ.210కోట్ల వ్యయంతో గోముత్రి రిజర్వాయర్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణం అభివృద్ధికి రూ.85కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.
see also :2019లో హిస్టరీ రిపీట్స్..!! ”ఇది ఫిక్స్”