ఓ సాధారణ రైతు పాతిక వేల రూపాయల అప్పుకోసం వస్తే ఆ రైతును పురుగును చూసినట్టుగా చూస్తారు బ్యాంకు అధికారులు. అప్పు ఇవ్వాలంటే ఏఏ నిబంధనలు పాటించాలో అన్నింటిని ఏకరువుపెడతారు. బ్యాంకు అధికారులు చెప్పిన నిబంధనలకు అనుగుణంగానే రైతు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా..ఆ రైతును పురుగును చూసినట్టు చూడటమే కాకుండా సవాలక్ష కొర్రీలు పెడతారు. అది కూడా అదిగమించి రైతు రుణం తీసుకుంటే.. ఎప్పుడైనా ఏ పంటో పండక వ్యవసాయం దివాలా తీసి ఓ వాయిదా రుణం కట్టకపోతే బ్యాంకు సిబ్బంది వచ్చి రైతు ఇంట్లోని సరుకులను జప్తు చేస్తారు.
బకాయిల వసూళ్లలో మేం చాలా స్ర్టిక్ట్ అని చెప్తారు. అదే, లక్షలకోట్ల ప్రజా ధనాన్ని రుణం రూపంలో బ్యాంకుల నుంచి తీసుకుని.. బకాయిలు కట్టగలిగే స్థితిలో ఉన్నా కూడా అప్పులు తీర్చకుండా ఎలా ఎగ్గొట్టాలో చూసే కార్పొరేట్ దొంగల నుంచి మాత్రం దమ్మిడి పైసా కూడా వసూలు చేసే ప్రయత్నమే చేయవు.
see also : సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న చంద్రబాబు వ్యాఖ్యలు..!!
see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..?
అద్దెకు సూటు బూటు తీసుకుని, ఆర్థిక ప్రగతికి తమ వంతు కృషి చేసేసి.. వేల మందికి ఉపాధి కల్పిస్తామని నమ్మబలికి నకిలీ పత్రాలను చూపించి బ్యాంకుల వద్ద లక్షల కోట్లలో రుణం తీసుకుని ఓ అమావాస్య రాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా దేశం బార్డర్ దాటేస్తున్నారు దర్జా దొంగలు. అలాంటి దర్జా దొంగలు దేశ బ్యాంకింగ్ పరిశ్రమను దివాలా తీస్తున్నారు. ఇలా అప్పుల ముసుగులో బ్యాంకుల్లోని ప్రజా ధనాన్ని లూఠీచేసే దర్జా దొంగల విషయంలో బ్యాంకులు చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇలా బ్యాంకులకు కన్నాలు వేసే రోజులు పోయాయ్. పట్ట పగలే బ్యాంకులకు నేరుగా వెళ్లి మర్యాదగా దోచుకునే రోజులు వచ్చేశాయ్. ఈ ఘరానా దోపీడీకి ప్రభుత్వాలు పెట్టిన ముద్దు పేరు కార్పొరేట్ రుణం.
see also : బాత్రూంలోనే గుండె పోటు ఎందుకొచ్చింది..!
se also : మందుబాటిళ్లతో బయటపడిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో
ప్రజా ధనాన్ని దర్జా దొంగలకు అప్పగించే విషయంలో ఎలాంటి నిబంధనలను బ్యాంకులు పట్టించుకోవడం లేదు. వాళ్లు అప్పులు చెల్లించకుండా చేతులు ఎత్తేస్తే చాలు.. పాపం వాళ్లు కష్టాల్లో ఉన్నారని దర్జా దొంగలు చేసిన ఆ రుణాలను మాఫీ చేసేయ్యడం బ్యాంకుల వంతైంది.
ఇలా సరికొత్త మార్గాల్లో బ్యాంకులను దోచుకుంటున్న దర్జా దొంగలు బ్యాంకులకు కొత్త అల్లుళ్లలా కనిపిస్తున్నారేమోనన్న అనుమానం ప్రతీ సామాన్యుడి మదిలో మెదులుతోంది. అందుకే దొంగలకు అల్లుళ్లకు ఇచ్చే మర్యాద కూడా చేస్తున్నారు. ఇలా దర్జా దొంగలంతా కలిసి మన దేశంలోని జాతీయ బ్యాంకులకు పెట్టిన కుచ్చుటోపీ ఖరీదు అక్షరాలా రూ.పది లక్షల కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని అన్ని ప్రముఖ బ్యాంకులు దర్జా దొంగలకు బాగానే దోచిపెట్టాయని చెప్పొచ్చు.
see also : భోనీ కపూర్ అరెస్ట్ …!
ప్రకృతి వైపరిత్యాల వల్లనే, నాశిరకం విత్తనాల వల్లనో, నకిలీ ఎరువుల వలనో పంటనష్టపోయిన రైతులు పెట్టిన పెట్టుబడి రాకుండా ఎవరైనా ఉసూరుమంటే. .వారి రుణాలను మాఫీ చేయమంటే..! రుణాలు మాఫీ చేస్తే ఏమైనా ఉందా.? ఆర్థిక క్రమశిక్షణ దెబ్బతినేస్తుందని బ్యాంకు అధికారులు అడ్డుపడిపోతారు. ఇందుకు నిదర్శనం ఎస్బీఐ లో అత్యున్నత హోదా వెలగబెట్టిన అరుంధతీ భట్టాచార్యనే. ఏదేమైనా
మొత్తానికి బ్యాంకింగ్ పరిశ్రమను పీకల్లోతు నష్టాల్లోకి నెట్టేసి పరిశ్రమ సంక్షోభంలో ఉంది కాబట్టి ప్రైవేటీకరణే దానికి మందు అని ప్రజలను ఒప్పించడాని పెద్ద స్థాయిలోనే కుట్ర జరుగుతోందంటున్నారు మేధావులు.
see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్
అలా లక్షలు, వేల కోట్లలో రుణం తీసుకుని బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీల్లో కొన్ని ఇవే..!!!
నీరవ్ మోడీ…………………………రూ.12 వేల కోట్లు
విజయ్ మాల్యా…………………… రూ.9వేల కోట్లు
జతిన్ మెహతా …………………….రూ.5,500 కోట్లు
సందీప్ ఝన్‌ఝన్ వాలా…………రూ.2,730 కోట్లు
పీకే తివారి…………………… ……..రూ.2,416కోట్లు
భారత్ స్టీల్ లిమిటెడ్………………. రూ..44,478 కోట్లు
ల్యాంకో ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్………..రూ..44,364 కోట్లు
ఎస్సార్ స్టీల్ లిమిటెడ్………………..రూ.37, 284 కోట్లు
భూషణ్ పవర్ అండ్ స్టీల్…………….రూ.38,000 కోట్లు
అలోక్ ఇండస్ట్రీస్……………………….రూ.22,000 కోట్లు
ఆమ్టెక్ ఆటో లిమిటెడ్……………….రూ.14,000 కోట్లు
మన్నెత్ ఇస్పాత్ లిమిటెడ్……………రూ.10,000 కోట్లు
ఎలక్ట్రో స్టీల్ లిమిటెడ్……………………రూ.10,000 కోట్లు
ఎరా ఇన్ఫ్రా కంపెనీ……………………..రూ.10,273 కోట్లు
జైపీ…………………………………………రూ.9,700 కోట్లు
ఏబీజీ షిప్‌యార్డ్…………………………రూ.6,900 కోట్లు
జ్యోతి స్ట్రక్చరల్…………………………….రూ.5,165 కోట్లు
ల్యాంకో ఇన్ఫ్రాటెక్……………………… రూ.44 వేల కోట్లు
ఆర్ఈఐ ఆగ్రో అధినేత సందీప్ ఝన్‌ఝన్‌వాలా ……..రూ.2,730 కోట్ల
రొటోమాక్ సంస్థ అధినేత విక్రమ్ కొఠారీ………రూ. 800 కోట్లు
విన్సమ్ డైమండ్స్ అండ్ ఫరెవర్ ప్రీసియస్ జువెల్లరీ ప్రమోటర్ జతిన్ మెహతా బ్యాంకులకు బాకీపడింది 5,500 కోట్లు.
ఇలా పరిశ్రమల స్థాపన పేరుతో ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వారిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.