తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా రోదిస్తూ లేచి..తను తెచ్చుకున్న సంచి నుండి ఫైల్ తీశాడు.
see also :ఫ్లాష్ న్యూస్.. పీకే ఫైనల్ సర్వే.. 175 సెగ్మెంట్స్ రిజల్ట్స్ అవుట్..!
దీనిని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అతనిని తన దగ్గరకు తీసుకరావాలని పోలీసులను కోరారు.దీన్తో మాలోతు కృష్ణను వేదిక దగ్గరికి తీసుకేల్లి మైక్ ఇచ్చారు..ఈ సందర్భంగా కృష్ణా మాట్లాడుతూ..తన కూతురు ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతోందని, ఆమెకు ఓవర్సీస్ పథకం కింద స్కాలర్‌షిప్ రాదని అధికారులు చెబుతున్నారని వాపోయాడు. మీరే ఆదుకోవాలని కంటతడి పెట్టాడు. తన కూతురు మాలవత్ ఇందు ఫిలిప్పీన్‌లో ఎంబీబీఎస్ చదువుకునేందుకు వెళ్లి.. అక్కడ పడరాని పాట్లు పడుతోందని కృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు.
see also :హోటల్‌రూమ్‌లో శ్రీదేవి.. అసలు ఏం జరిగిందంటే..?
ఓవర్సీస్ విద్యా పథకం కింద స్కాలర్‌షిప్ వస్తుంనదుకుంటే.. అధికారులు కుదరదని చెప్పారనీ, పొలం, ఆస్తులన్నీ అమ్మేశానని సీఎంకు తెలిపాడు. ఇంకా ఫీజుకోసం డబ్బు చెల్లించాల్సి ఉందనీ, మీరే సాయం చేయాలంటూ కేసీఆర్‌కు విన్నవించుకున్నాడు. తక్షణమే స్పందించిన కేసీఆర్.. ప్రత్యేక కేసు కింద స్కాలర్‌షిప్ మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని కలవాలని కృష్ణకు సూచించారు.ఈ సందర్భంగా అక్కడున్న రైతులందరు ఏ సందర్భంలోనైనా ఎలాంటి సాయమైనా అందించడంలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు హాట్సాఫ్ చెప్పారు..
see also :పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌కు శుభంకార్డు..!!
see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి