ఏపీ రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రత్యేకహోదా కోసం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరుస ప్రకటనలు చేసినప్పటి నుండి రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ఇక ప్రస్తుత పరిణామాల క్రమంలో ఏపీలో జనం నాడికోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫైనల్ సర్వే రిపోర్ట్ ఇప్పుడు మరింత రచ్చలేపుతోంది.
See Also:ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టుకు రంగం సిద్ధం..!!
జగన్ ప్రజాసంకల్పయాత్ర స్టార్ట్ చేసినప్పటి నుండి పీకే తన సర్వే టీమ్‌తో రాష్ట్రంలోని 175 సెగ్మెంట్‌లలో సర్వే చేయించారు. ఇక ఒక్కో సెగ్మెంట్ నుంచి దాదాపు వెయ్యి మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని సెగ్మెంట్‌లలో రిపోర్ట్స్ వడపోసి ఫైనల్ రిజల్ట్ చూసి షాక్ అయ్యారట. మోత్తం 175 స్థానాల్లో వైసీపీ పుంజుకుందని.. 43 శాతం ఓట్లతో వైసీపీ 118 స్థానాలు కైవసం చేసుకోనుందని.. మిగతా సెగ్మెంట్‌లలో కూడా గట్టి పోటీ ఉంటుందని తేలిందట. ఇక టీడీపీ-బీజేపీ కూటమికి మాత్రం 47 స్థానాలు, జనసేనకి 8, కాంగ్రెస్‌కి 2 సీట్లు రావొచ్చని పీకే సర్వే రిపోర్ట్ తేల్చేసింది.
See Also:ఏపీ సచివాలయం సాక్షిగా మరో అన్నదాతపై దాడి..!!
ఇక వైసీపీ పుంజుకోవడానికి కారణాలు చూస్తే.. జగన్ పాదయాత్ర జనాల్లోకి బాగా చొచ్చుకుపోయింది. జగన్ ప్రణాళికా పరంగా ఇస్తున్న హామీలు.. ప్రజల్లో విశ్వాసం పెంచిదట. అంతే కాకుండా తాజా రగడ ప్రత్యేక హోదా, అవిశ్వాసం తీర్మానం పెడతామని తేల్చేసిన జగన్ సంచలన ప్రకటనతో వైసీపీ మైలేజ్ అమాంతంగా పెంచేసిందట. ఇక అధికార టీడీపీ పరిస్థితి చూస్తే గత ఎన్నికల్లో.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, జిల్లాల్లో భారీ విజయం సాధించిన టీడీపీకి ఈసారి గట్టిదెబ్బే తగలనుందని.. ముఖ్యంగా ప్రత్యేకహోదా పై టీడీపీ స్పందించిన తీరు చాలా మోసపూరితంగా ఉందని.. దీంతో వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ మైలేజ్ ఫుల్ డ్యామేజ్ అవడం ఖాయమని ఆ సర్వే తేల్చింది.
See Also:పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌కు శుభంకార్డు..!!