అందాల నటి శ్రీదేవి మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.ఆమె ఆదివారం వేకువజామున దుబాయ్ లో మృతి చెందింది.అయితే మొదటగా అందరూ గుండెపోటు తో మరణించింది అని భావించినా..కాసేపటి క్రితం ఫోరెన్సిక్ నివేదికలో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి చనిపోయిందని తెలిపింది.
see also : రాహుల్ కు మద్దతు ఇచ్చిన మంత్రి కేటీఆర్
ఈ క్రమంలో ఈ కేసు దుబాయ్ లోని పోలీసులు దుబాయ్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు.వాళ్ళు విచారణ మొత్తం పూర్తిచేయడానికి మరింతసమయం పట్టే అవకాశం ఉంది.కాగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి మృతదేహాన్ని తీసుకునేందుకు బోనీకపూర్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు అక్కడ వేచి చూస్తున్నారు. కానీ శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఈ రోజు అప్పగించడం అనుమానమేనని అధికారులు తెలిపారు.
see also : పవన్ కల్యాణ్‌పై కేవీపీ సంచలన వ్యాఖ్యలు..!!
see also : బిగ్ బ్రేకింగ్.. వైసీపీలోకి మరో కాంగ్రెస్ మాజీ మంత్రి.. ఎంపీ టికెట్ ఫిక్స్..?