తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు.
ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం కాదు.అది ఒక జీవన విధానం అని ఆయన అన్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని పూర్తిచేస్తే రైతన్నలు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల సంపదను సృష్టించబోతున్నారు అని ఆయన అన్నారు.
అంతే కాకుండా ఎకరాకు ప్రభుత్వం అందించే ఎనిమిది వేల రూపాయలను వద్దు అనుకునే మొట్ట మొదటి రైతును నేనే అని ఆయన ప్రకటించారు.దేశ చరిత్రలో తమకు వచ్చే సకల సౌకర్యాలతో పాటు ప్రజా సొమ్మును వృధా చేసే నాయకులున్న ప్రస్తుత రోజుల్లో ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను తిరస్కరిస్తున్న ఏకైక నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని రైతన్నలు ,ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.