రైతులకు కనీస మద్దతు ధర వచ్చి.. రైతు బాగుపడిన రోజే నిజమైన పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు జరిగింది . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..ఏ మండలానికి ఆ మండల ఎమ్మార్వోనే రిజిస్టర్ గా ఉంటారు.ఇక నుంచి రిజిస్టేషన్ గురించి లంచాలు ఇచ్చుడు బంద్ అని అన్నారు .పాస్ పోర్ట్ వచ్చినట్టే పాస్ బుక్కులు కూడా పోస్టులో మీ ఇంటికి వస్తాయి. పాస్ బుక్ ఇవ్వడంలో సబ్ రిజిస్టర్ ఆలస్యం చేస్తే..రోజుకు రూ.వెయ్యి చొప్పున ఫైన్ విధిస్తాం అని చెప్పారు .నేను రైతునే..ప్రభుత్వ ఇచ్చే పెట్టుబడి సాయం వదులుకుంటాను.. పంట సాయం వద్దనుకునే వారు వెనక్కి ఇవ్వొచ్చు అని అన్నారు.
see also : శ్రీదేవి మరణం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
అన్ని రంగాలకు 24గంటల కరెంట్ అందుబాటులో ఉంటుంది.రూ.12 వేల కోట్లు రైతుల పెట్టుబడి కోసం వచ్చే బడ్జెట్ లో కేటాయించబోతున్నాం.రైతులకు ఏం కావాలన్నాఅన్ని విధాలుగా సమకురుస్తాం అని చెప్పారు .మన రైతులు పండించే పంట విలువ రూ.లక్షా 25వేల కోట్లు ఉండబోతుంది అని తెలిపారు .కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపినం.రైతు సమన్వయ సమితులు సరిగ్గా ఉంటె కల్తీ చీడ పురుగులుండవు అని అన్నారు.
see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?
రైతులను ఆర్గనైజ్ చేయడం వల్ల విజయాలు సాధిస్తాం.రైతులు వ్యవస్థీకృతమైతే పంట కాలనీలు కూడా సాధ్యమే..ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు మంజూరు చేస్తాం అని పేర్కొన్నారు .ప్రతి రైతు వేదిక 5వేల ఎకరాల పంట లెక్క తీయాలి.ఏ ఎకరంలో ఏ పంట పండుతుందో సమన్వయ సమితికి తెలియాలన్నారు .నాలుగైదు ఏళ్ల తర్వాత నాట్లు వేసే వాళ్లు దొరకరు. ప్రతి 5 ఎకరాలకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాల లెక్క తెలియాలి. నాట్లు వేసే యంత్రాలను 50శాతం సబ్సిడీతో ఇస్తం.అందరూ ఒకటే పంట వేస్తే అందరికీ నష్టం. అధికారులు సూచించిన ప్రకారం పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుంది అని చెప్పారు .
see also :శ్రీదేవి అసమాన నటి..వైఎస్ జగన్
ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నం అని తెలిపారు .తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లే రైతు సమన్వయ సమితిలో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,రైతు సమన్వయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
see also :శ్రీదేవి మరణం పట్ల రామ్ గోపాల్ వర్మ ఏమని ట్వీట్ చేశారంటే