తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇవాళ నాగర్ కర్నూల్ లో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులను మంత్రి లక్ష్మారెడ్డి , స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శ్రీధర్ ,ఎమ్మెల్యేలు, బాలరాజు ,శ్రీనివాస్ గౌడ్ ,జక్కా రఘునందన్ రెడ్డి తో కలిసి పరిశీ లించారు.
see also : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!
ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడుతూ..కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.మినీ ట్యాంక్ బండ్ కు రూ.12 కోట్లు మంజూరు చేశామన్నారు.రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మినీ ట్యాంక్ బండ్ లు ఏర్పాటుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.నియోజకవర్గంలోని ప్రజలకు ఆహ్లాదం కోసం చెరువు ప్రాంగణంలో జిమ్,వాకింగ్ స్థలాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.అంతేకాకుండా చెరువు కబ్జా కాకుండా రైతులు అంగీకరిస్తే..చెరువు చుట్టూ నిర్మాణం చేపడుతామని చెప్పారు.
see also :డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…!
see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..!