తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.ఇవాళ టీ రిచ్ వార్షిక దినోత్సవం లో మంత్రి కేటీ ఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీ రిచ్ ఏర్పాటు చేసిన తొలి ఏడాదిలోనే అద్బుతమైన పరిశోధనలు చేసిందని చెప్పారు.
see also :ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడున్నరేళ్లలో ఎన్నో ప్రభావవంతమైన విధానాలు తీసుకువచ్చామని తెలిపారు.రీసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, ఇండస్ట్రీ, స్టార్టప్స్‌ని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకే టీ రిచ్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీ ఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని టీ హబ్ ఎన్నో పరిశ్రమల స్థాపనకు ఉపయోగపడిందని గుర్తు చేశారు.భారతదేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఎదిగామని తెలిపారు. వ్యాపార, తయారీ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిమిస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.