తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రంగం ముందుకు సాగాలన్నారు. మంత్రి కేటీఆర్ చర్చాగోష్టిని ప్రారంభిస్తూ హైదరాబాద్ ఫార్మాస్యుటికల్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నిలిచిందని, దేశంలోని మొత్తం ఫార్మా ఉత్పత్తుల్లో 35% హైదరాబాద్‌లోనే ఉందని ఆయన వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్‌లో 35%కు పైగా హైదరాబాద్‌లోనో జరుగుతోందని ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్’ గుర్తింపును హైదరాబాద్ దక్కించుకుందని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలు ప్రశ్నలు సంధించారు.
see also :సీఐఐ సదస్సు.. మొదటిరోజే నవ్వుల పాలైన చంద్రబాబు
see also :సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
చర్చాగోష్టిలో కేంద్రమంత్రి సురేష్ ప్రభు పలు గణాంకాలను దారాళంగా చెప్పడంపై మంత్రి కేటీఆర్ సంబ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ‘ అనేక గణాంకాలు వెంటవెంటనే చెప్పగలిగారు. మీలాగా ఇక్కడున్న మరెవ్వరూ చెప్పలేరు. బయాలజీ విద్యార్థిని అయిన నాతో అయితే కష్టమే. పూర్వాశ్రమంలో మీరు అకౌంటెంట్. ఆ పరిజ్ఞానం ఉపయోగపడిందేమో’ అని చమత్కరించారు. `మీకు మంచి మెమోరీ ఉంది` అని కేంద్ర మంత్రి కేటీఆర్‌ను పొగిడారు. కాగా, అనంతరం కేంద్ర మంత్రిని శాలువాతో సన్మానించి కాకతీయ తోరణం ఉన్న జ్ఞాపికను అందించారు. ‘మీరు గొప్ప, ఆదర్శమైన నాయకుడు. మీతో వేదికతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
see also :పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..