దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలానే వైఎస్ జగన్‌లో రాజకీయ పరిణితి కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తనను టీడీపీలోకి ఆహ్వానించాడని, కానీ, నాకు ప్రాంతీయ రాజకీయ పార్టీలకంటే.. జాతీయ రాజకీయ పార్టీలవైపే మక్కువ ఉండటంతో రాజీవ్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరానన్నారు. ఆ సమయంలోనే టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఆ తరువాత ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెట్టానంటూ తన రాజకీయ అనుభవం గురించి మీడియాతో చెప్పుకొచ్చారు.
see also : బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..
see also : జగన్ నిర్ధోషి.. తెరపైకి ఒరిజినల్ కంపెనీ.. పచ్చ బ్యాచ్‌కి అర్ధమయ్యేలా షేర్లు కొట్టండి..!
ఏపీలోని తాజా రాజకీయ పరిణామాల గురించి టీ.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అందరి రాజకీయ నాయకుల్లా వ్యవహరించకుండా.. వైఎస్ఆర్‌లా ప్రజల మధ్యకు పోకు… వారి సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. ప్రజా సంకల్ప యాత్రతో జగన్ రాజకీయంగా మరింత పరిణితి చెందారన్నారు. నాటి రోజుల్లో వైఎస్ఆర్ ఎప్పుడైనా హస్తిన వస్తే నా ఇంట్లోనే భోజనం చేసి, ఉన్నతాధికారులతో సమావేశమయ్యేవారని చెప్పారు టి.సుబ్బిరామిరెడ్డి. ప్రజా సంకల్ప యాత్రతో ఆరు నెలలపాటు ప్రజల మధ్యనే ఉండటం చాలా గొప్ప విషయమంటూ వైఎస్ జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.