తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా హైదరాబాద్ నగరం బల్క్ డ్రగ్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. వ్యాక్సిన్ తయారీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
see also :టీడీపీకి సరైన షాకిచ్చిన బీజేపీ.. వైసీపీలోకి ముగ్గురు మాజీ మంత్రులు..?
అటు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు మాట్లాడుతూ.. ఫార్మా రంగం అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ చొరవ ప్రశంసనీయమని అన్నారు. చాలా దేశాలు ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.
see also :వైసీపీలోకి జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ నటి …!