ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఐఐ సందర్భంగా నిర్వహిస్తున్న మొదటిరోజే నవ్వుల పాలయ్యే సందర్భం ఎదురైంది. ఇంకా చెప్పాలంటే…ఆయన తన ప్రచారా యావను చాటిచెప్పుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే… సీఐఐ సదస్సు గురించి ఇచ్చిన వివరాల పత్రంలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకున్నారు. అత్యంత చిత్రంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మాత్రం.రెండు రాష్ర్టాలకు కాకుండా ఒక్క రాష్ర్టానికే గవర్నర్ అని పేర్కొన్నారు.
see also :పీకే ఫ్యాన్స్ “మైండ్ లెస్ ఫెలోస్ “.వాళ్ళ వల్ల పీకే పొలిటికల్ లైఫ్ స్మాష్ ..
see also :సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
సీఐఐ షెడ్యూల్ గురించి వివరిస్తూ కేంద్ర మంత్రి సహా ఇతరుల వివరాలను ప్రచురించారు. ఇందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఎం అని కాకుండా రెండు తెలుగు రాష్ర్టాలకు ముఖ్యమంత్రిని చేసేశారు.గవర్నర్‌ను ఒక్క రాష్ట్రానికే పరిమితం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ కొత్త ప్రచారం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
see also :తక్కువ మందితో ఎక్కువ వ్యాపారం చెయ్యడమే టీ రిచ్ ఆలోచన..కేటీఆర్