ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .కానీ తాజాగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అణుబాంబు పేల్చారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతా అని స్వయంగా బాబు బెదిరించారు.ఏకంగా విద్యార్థులను ,యువతను అయితే ఏకంగా కేసులు ఉంటె ప్రభుత్వ ఉద్యోగం రాదని హెచ్చరించారు.
అట్లాంటి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రత్యేక హోదా వలన ఎటువంటి లాభం ఉండదు.హోదా రాకపోతే కేవలం మూడు వేల కోట్ల రూపాయలే నష్టం అని చెప్పిన చంద్రబాబు ఆడియో వీడియో టేపులను బయటపెట్టాడు వీర్రాజు.ప్రత్యేక హోదా కోసం ధర్నాలు చేస్తే కేసులు పెడతా అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా మాట్లాడుతున్నాడు.
ఆయనకు ఈ చట్టాలు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు.ఒక ప్రముఖ పత్రికలో రెండు ఏళ్ళ కిందట అంటే 10-09-2016నాడు ప్రత్యేక హోదాకు సమానంగా ప్రత్యేక ఫ్యాకేజీ తీసుకుంటే తప్పు ఏముంది .ప్రతిపక్షాలకు సహకరించవద్దు అని ప్రజలను కోరుతున్నాను అని ఏకంగా ముఖ్యమంత్రి హోదా లో ఉన్న చంద్రబాబు కోరిన వార్తలను ..అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక ఫ్యాకేజీపై అభినందిస్తూ చేసిన తీర్మానాన్ని ఆయన మీడియా ముందు చూపించి సంచలనం సృష్టించారు.