అల్ట్రా–లగ్జరీ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ తాజాగా ‘రోల్స్‌రాయిస్’ 8 వ జనరేషన్ ఫాంటమ్ కారును భారత మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది.కాగా దీని ప్రారంభ ధర రూ.9.5 కోట్లు. ఈ సందర్భంగా రోల్స్‌రాయిస్ మోటార్ కార్స్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ మాట్లాడుతూ..మాకు కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్ తోడు లభించిందని…దక్షిణ భారత దేశంలో వ్యాపారం భాగా వృద్ది చెందుతుందన్నారు.కేయూఎన్ ఎక్స్‌క్లూజివ్ చెన్నై, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో కంపెనీకి అధికారిక డీలర్‌గా వ్యవహరిస్తుందని చెప్పారు.కాగా ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.4 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది.
see also : మానవత్వమా సిగ్గు పడు ..!