Home / SLIDER / వరంగల్‌లో 250 పడకల కేన్సర్‌ ఆస్పత్రి..!

వరంగల్‌లో 250 పడకల కేన్సర్‌ ఆస్పత్రి..!

కేన్సర్ అనేది పెద్ద వ్యాధి.కేన్సర్‌ను ముందుగానే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జిల్లా స్థాయిలో కేన్సర్‌ నిర్ధారణ, చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా ఆస్పత్రుల్లో 15 చొప్పున పడకలను ప్రత్యేకంగా కేన్సర్‌ రోగులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో ఆదేశించారు. ‘తెలంగాణ డయాగ్నస్టిక్స్‌’లో భాగంగా కేన్సర్‌ వ్యాధిని గుర్తించి చికిత్స అందించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

see also : వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!

అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో మాత్రమే 350 పడకల సామర్ధ్యం తో ప్రభుత్వ ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి ఉంది. అక్కడ పడకల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ మందికి చికిత్స అందించేందుకు ఇబ్బందిగా మారింది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రి తరహాలోనే హైదరాబాద్ నగరం తరువాత అతి పెద్ద నగరమైన  వరంగల్‌ నగరంలో మరో కేన్సర్‌ ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో రూ.120 కోట్ల వ్యయంతో 250 పడకల సామర్థ్యంతో కొత్త ఆస్పత్రిని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.

see also : 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ..మంత్రి కేటీఆర్

ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడి కార్యాలయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించేలా ప్రణాళిక ఉందని వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఆస్పత్రి నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేయనుంది.

see also : గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి

see also:  టీడీపీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు గుడ్ బై …

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat