తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కోసం ప్రత్యేక స్మారకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ప్రాణత్యాగం చేయగా.. అమరులను స్మరించుకునే విధంగా దేశంలో ఎక్కడాలేని విధంగా స్మారకకేంద్రం నిర్మించబోతోంది. దీనికి సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఈ ఫొటోలను ట్విట్టర్, ఫేస్బుక్లో మంత్రి కేటీఆర్ పోస్ట్‌చేశారు.
To eternalise the sacrifices of hundreds of martyrs in Telangana statehood movement, @TelanganaCMO has approved martyrs memorial design ?
Coming up at the famous Hussain Sagar at the core of Hyderabad pic.twitter.com/fELGrxdXXF
— KTR (@KTRTRS) February 21, 2018
స్మారకస్థూపాన్ని దీపం రూపంలో డిజైన్ చేశారు. అమరులకు నిరంతరం నివాళి అర్పిస్తున్నట్లుగా ఉండేవిధంగా రూపొందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని నిర్మించనున్నారు. స్మారకం డిజైన్‌లో గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం నాలుగు అంతస్థులుగా భవన నిర్మాణం ఉంటుంది. దీపం ఆకారంలో నిర్మించే భవనంలో నిత్యం జ్యోతి వెలిగేలా నమూనా సిద్దం చేశారు. ఒక అంతస్థులో మ్యూజియం, ఆడియో విజువల్ హాల్, సమావేశాల కోసం కన్వెన్షన్ హాల్, విజిటర్స్ కోసం రెస్టారెంట్ వసతులు కూడా ఉండనున్నాయి. రికార్డుసమయంలోనే దీనిని పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్మారక స్థూపం నిర్మాణంతో హుస్సేన్‌సాగర్ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారనుంది.
see also : ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..
see also : రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్