టీడీపీ కుంపటిలో సెగలు రేపిన కేంద్ర నిర్ణయం..! ఇక చంద్రబాబుకు చుక్కలే..!!
bhaskar
February 22, 2018
ANDHRAPRADESH, POLITICS
864 Views
చలికాలంలో కూడా ఏపీ టీడీపీ నేతల నుంచి వేడి గాలులు వీస్తున్నాయి. ఇదెక్కడి విడ్డూరం కొంపతీసి టీడీపీ కొంప తగలబడలేదుకదా..? అని అందరూ షాక్ అయ్యారట. అయితే, ఈ వేడిగాలులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కోకు ఒళ్లు మండి వేడిగాలులు వస్తున్నాయట. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ల సమక్షంలో తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వైపు చంద్రబాబు 2014 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ ప్రజలకు అమలుకాని వాగ్ధానాలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిన విషయం విధితమే.
అయితే, ఇప్పుడు మోడీ సర్కార్ చేసి ఓ ప్రకటన చంద్రబాబు కుంపటిలో సెగలు రేపుతోంది. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు సెంట్రల్ గవర్నమెంట్ ఏపీకి విడుదల చేసిన నిధులను ఆధారాలతో సహా మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీకి రూ.2 లక్షల కోట్లకు పైగా నిధులను మంజూరు చేశామని, అయితే, ఆ నిధులను ఎలా ఖర్చుపెట్టారో తమకు నివేదిక పంపాలని ఆదేశించారు. ఇలా బీజేపీ నేతలు కేంద్రం నిధులపై నివేదిక అడగడంతో చంద్రబాబు సర్కార్ ఏమి చేయాలో తోచక తలలుపట్టుకుంటోందట. మరో వైపు చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పేరుతో కమిషన్లు దండుకున్నట్లు, ఆ క్రమంలోనే పోలవరం తహశీల్దార్‌ను బదిలీ చేశారని పలు పత్రికలు కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఇలా బీజేపీ నేతలు రూ.2లక్షల కోట్లు ఖర్చుపై ఆరా తీయడంతో చంద్రబాబుకు ఎక్కడాలేని ఒళ్లునొప్పులన్నీ ఒక్కసారిగా వచ్చిపడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
Post Views: 289