ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు టీడీపీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆలస్యంగా తెలిసిన ఈ ఉదంతం టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలోని పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వైసీపీ కార్యకర్తకు రూ. 10 లక్షల సిమెంటు రోడ్డు పని ఇచ్చారు. దానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆ పనికి బిల్లు ఎలా మంజూరు చేయాలని సంబంధిత పంచాయతీరాజ్ అధికారి చీఫ్‌విప్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈయన నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాటిని సంబందించిన బిల్లులు పెండింగ్ లో పెట్టినట్లు సమచారం. క్రమంలో ఈనెల 11న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ వివాహ కార్యక్రమం కోసం పుట్టపర్తికి వచ్చారు.
see also..21 సంవత్సరాలుగా ఉన్నా..నేడు వైసీపీలో చేరుతున్న…ఎవరో తెలుసా..!
ఆ సమయంలో పెడపల్లి సిమెంటు రోడ్డు బిల్లు మంజూరు విషయమై ఎదురైన సమస్యను ఎంపీ జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే పల్లె రఘునాథరెడ్డికి ఫోన్ చేశారు. నేను ఎవ్వరిమాట వినననే విషయం తెలుసుకదా..రఘునాథ్ ..కార్యకర్తలతో సమన్వంయం లేనప్పుడు చీఫ్‌విప్ పదవులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు నీ వైఖరి మార్చుకో అని హెచ్చరించారు. ప్రస్తుతం ఆ ఫోన్ సంభాషణను సోషల్‌మీడియాలో బాగా వైరల్ కావడంతో టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
see also..వైసీపీలోకి ఫిరాయింపు ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..!