తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో బయో ఏషియా-2018 సదస్సు ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ నెల 24 వరకు జరిగే ఈ సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 50కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకి హాజరయ్యారు.
SEE ALSO :మంత్రి కేటీఆర్‌కు నాస్కాం కాబోయే అధ్యక్షురాలి అనూహ్య ప్రశంస
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు.హైదరాబాద్ నగరంలో 19 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.దీ ని ద్వారా ప్రపంచంలోనే మన ఫార్మాసిటి అతి పెద్దది కానున్నదని తెలిపారు. బయోసైన్స్ రంగంలో 10 వేలకు పైగా కంపెనీలు పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియా ఖండంలోనే అతి పెద్దదన్నారు.తెలంగాణ లో వందకు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో తెలంగాణకు అగ్ర పథంలో నిలుపుతామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
SEE ALSO :గోషామహల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం..పోచంపల్లి
SEE ALSO : కేసీఆర్ మార్చిన బతుకు చిత్రం..!
At the Inaugural of @BioAsia2018 today spoke on the investment opportunities in Pharma, Bulk Drugs, Biotech & Medical devices manufacturing in Telangana
Hyderabad Pharma City, Genome Valley 2.0 and sustained efforts will usher in new technologies & employment pic.twitter.com/KAs7LkySRt
— KTR (@KTRTRS) February 22, 2018