ఏపీలో అధికార టీడీపీ చేసిన భారీ కుట్ర సోషల్ మీడియాలో బట్టబయలు అయ్యింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 10నుంచి 15వేల ఓట్లు, రాష్ట్రం మొత్తం మీద 14లక్షల వోట్లు పైగా చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. టిడిపికి ఓటు వేసే వాళ్ళ వోట్లు అయితే అలానే ఉంచుతున్నారు. అదే వైసీపీ వాళ్ళ ఓట్లు అయితే తీసేస్తున్నారు.ప్రజల్లో ఇప్పటికే టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత రావడంతతో దొంగ పనులు చేస్తూ గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితేఈ అన్యాయాన్ని మీ యేల్లో మీడియా చూపించకపోవడం గమనార్హం.
see also : ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!
మన రాజ్యాంగం పౌరులకు కల్పించిన పవిత్రమైన ఓటు హక్కుకు అధికార తెలుగుదేశం పార్టీ తూట్లు పొడిచింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీకి ఓట్లు పడకూడదని రాష్ట్రం మొత్తంలో 14.77 లక్షల ఓట్లను తొలగించింది. ముఖ్యంగా తొలగించిన ఓట్లన్నీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతిపరుల ఓట్లే కావడం గమనార్హం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో జనవరి 23 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టగా… అధికార టీడీపీ దీన్నొక అవకాశంగా వాడుకుని.. వైసీపీ అనుకూలంగా ఉండే ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. అయితే అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 3.20 లక్షల ఓట్లపై వేటు వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కచ్చితంగా వైఎస్సార్‌సీపీకి ఓటు వేస్తారనే అంచనా ఉన్న ఓటర్లపై గురిపెట్టారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10 వేల నుంచి 15 వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. దీంతో ఓటర్లు తమ ఓట్లు ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తుంటే అధికారులు అడ్డగోలుగా సమాధానం చెబుతున్నారు. దీంతో అధికారం అడ్డం పెట్టుకొని టీడీపీ అడ్డగోలుగా కుట్రలు చేస్తున్నారని సర్వత్రా విమర్శిస్తున్నారు.
see also : జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి.. సీనియర్ కాంగ్రెస్ నేత