రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా చేయుచ్చు అని కేటీఆర్ అన్నారు. కొత్తగా వచ్చే ఏ టెక్నాలజీ అయిన సమాజానికి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ శాఖల్లో టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ స్టార్టప్ స్టేట్‌గా ఎదుగుతుందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
SEE ALSO : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
see also : 2వేల553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..!
Minister @KTRTRS delivering the keynote address at Digital Social Innovation – Technology for Social Good Awards ceremony @nasscom Social Innovation Forum #WCITIndia2018 #NASSCOM_ILF pic.twitter.com/eGuXaclL6i
— Min IT, Telangana (@MinIT_Telangana) February 21, 2018