ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చలసాని శ్రీనివాస్ మొదట జగన్ గురించి మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా పెట్టిన కేసుల్లో వైఎస్ జగన్ నేరస్థుడు కాదని, కేంద్ర, రాష్ట్ర కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తరువాత ఆ పార్టీలో సెకండ్ మోస్ట్ పాపులర్ లీడర్ రోజానేనని, సినిమా ఫీల్డ్ లో కష్టపడి ఓ స్థాయికి ఎదిగిన నటుల్లో రోజా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందన్నారు. ఒక విజన్‌తో ముందుకెళ్తోందని ఆర్‌కే రోజాపై చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు.