ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగనున్నదా ..గత తొంబై ఐదు రోజులుకు పైగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలలో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.దీంతో వైసీపీ పార్టీ వైపు ఆకర్సితులవుతున్నారు.అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేసి గెలుపొందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ దాదాపు నలబై వేల మందితో కల్సి వైసీపీ గూటికి రావడానికి రంగం సిద్ధమైనట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
see also : రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
అయితే ఈ నియోజక వర్గంలో ప్రజలందరితో కలసిపోయి పని చేస్తాడనే టాక్ ఉంది.రాష్ట్ర విభజన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి చేయలేదు.తాజాగా పాండిచ్చేరి మంత్రి మల్లాడి సహకారంతో ఆయన వైసీపీ గూటికి రానున్నారు.ఇప్పటికే జగన్ తో పాటుగా పలువురు వైసీపీ కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు .దీంతో ఉగాది పండుగ లోపు వైసీపీ గూటికి చేరాలని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ఆయన అనుచవర్గం చెబుతున్నారు.
see also : వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు ..టికెట్ ఖరారు చేసిన జగన్ …!
తనకు రాజకీయ గురువు అయిన పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆశీస్సులతోనే జగన్ సమక్షంలో పార్టీలో చేరి దాదాపు నలబై వేల మందితో సభ్యత్వం తీసుకునే విధంగా ఈ ముహూర్తం ఖరారు చేసుకున్నారు అని జిల్లా రాజకీయాల్లో టాక్ ..మొత్తం నియోజక వర్గంలో యాబై వేలమంది ఎస్సీలు , బీసీల్లో నలబై వేలమంది బలిజ,ముప్పై వేలమది కాపులు ఉన్నారు .వీరి ఓట్లే కీలకం కానుండటంతో మత్స్యకారుల ఓట్లను తెచ్చుకునే సత్తా ఉండటం.ఎస్సీల్లో కూడా సతీష్ పట్ల సానుకూలత ఉండటంతో జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని సమాచారం..
see also :హ్యాట్సాఫ్ రోజా ..!! చలసాని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు