వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 93 వ రోజు తిమ్మపాలెం వద్ద ముగిసిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో 94వ రోజు షెడ్యూలు ఖరారైంది. బుధవారం ఉదయం తిమ్మపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా ప్రజలతో మమేకమైన అనంతరం జననేత వైఎస్ జగన్ పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు పర్చూరివారిపాలెం నుంచి యాత్ర మొదలవుతోంది. కొండేపి నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. వెంగళాపురం క్రాస్ మీదుగా మీదుగా కొనసాగనున్న పాదయాత్ర పెద్దఅలవలపాడుకు చేరుకుంటుంది. వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. రాత్రికి పెద్దఅలవలపాడులోనే బస చేస్తారు.