వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విసిరిన సవాల్ ను స్వికరిస్తున్నా అని.. అన్నింటికీ సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కొద్ది సేపటి క్రితం అయన మీడియా తో మాట్లాడుతూ..అవిశ్వాస తీర్మానాన్ని జగన్ పెట్టాలని అయన కోరారు.అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు.. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తానని … ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అని అన్నారు. వచ్చే నెల ( మార్చి ) 4న నేను ఢిల్లీకి వస్తాను. అందరు ఎంపీల మద్దతు కూడగడతాను. ముందు జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టాలి” అని అన్నారు .వైసీపీ అవిశ్వాస౦ పెడితే టీడీపీ పార్టీ వైఖరే౦టో తెలుస్తుందన్నారు.
