తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓ ప్రముఖ కళాకారుడు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.సీ ఎం కేసీఆర్ జన్మించిన తేదీ 17-02-1954.అయితే ఈ నంబర్లు వరుసగా ఉన్న రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను DVR ప్రసాద్ అనే వ్యక్తి సేకరించాడు. అన్ని నోట్లపై 170254 నెంబరు ఉండడంతో సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు.అంతేకాదు ఈ వినూత్న శుభాకాంక్షలకు ‘హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్ ’లో చోటు దక్కింది. దీనికి సంబంధించిన పత్రాన్ని ప్రసాద్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అందజేసి అభినందించారు.
.