తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని HICC లో జరుగుతున్న అంతర్జాతీయ మైనింగ్ టుడే సదస్సుకు మంత్రి కేటీఆర్ తో పాటు..గవర్నర్ నరసింహన్ ,కేంద్ర మంత్రి తోమర్ తో పాటు దేశ విదేశాల నుండి 500మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు .
see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, సచివాలయం నుంచే వీక్షణ..!
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..టీఎస్ ఐపాస్ ద్వారా మైనింగ్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని అన్నారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.రాష్ట్రంలో గ్రానైట్ గనులు ఉన్నాయన్నారు.దక్షిణ భారతదేశంలోనే తెలంగాణాలో బొగ్గు గనులు ఎక్కువ అని చెప్పారు.గనుల రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని స్పష్టం చేశారు.గనుల్లో కార్మికుల రక్షణకు కొత్త టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.రాష్ట్రంలో అత్యుత్తమ శాండ్ పాలసీ తీసుకొచ్చినం అన్నారు . కొత్త ఇసుక విధానం ద్వారా పర్యావరణాన్ని కాపాడుతున్నమని తెలిపారు .
Minister @KTRTRS addressing mining engineers, geologists, academicians, and mineral processing technologists from across the globe at the Mining Today 2018 International Conference-cum-Exhibition in Hyderabad. pic.twitter.com/oHs2bJBizt
— Min IT, Telangana (@MinIT_Telangana) February 14, 2018