వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాజా రాజకీయాలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచేసింది. ఒకవైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు.. ఏపీకి సెంటిమెంట్ అయిన ప్రత్యేక హోదా పై తాడోపేడో తేల్చుకోవడానికి డెడ్‌లైన్ ప్రకటించి సంచలనం రేపాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి కేంధ్రప్రభుత్వానికి హెచ్చరికులు పంపిస్తూ.. వైసీపీ ఎంపీలు రాజీనామా తేదీని ప్రకటించి.. అటు నాటాకాలు ఆడుతున్న టీడీపీ బ్యాచ్‌కి కూడా బ్లాస్టింగ్ పంచ్ ఇచ్చాడు. దీంతో మైండ్ బ్లాక్ అయిన టీడీపీ గ్యాంగ్.. ఒక్కొకరుగా బయటకి వచ్చి జగన్ పై అర్ధం పర్ధం లేకుండా కూతలు కూస్తున్నారు.
see also : ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి..కేటీఆర్
టీడీపీ ఎంపీ జేసీ బ్రదర్ నుండి జగన్ పై ఎల్లో దాడి మొదలవగా తాజాగా టీడీపీ సీనియర్ నేత కుంభంపాటి రామ్మోహన్ జగన్ పాదయాత్ర పై కామెంట్స్ చేసి తన నోటి దూల తీర్చుకున్నాడు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూడబెట్టిన అక్రమాస్తులన్నింటినీ ప్రజలకు అప్పగించిన తర్వాతే పాదయాత్ర చేయాలని.. లేని యడల జగన్ తన పాదయాత్ర ఆపేయాలని దిక్కుమాలిన డిమాండ్ కూడా చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు టీడీపీ బ్యాచ్ పై ఎదురుదాడి మొదలు పెట్టారు. జగన్ ఏనాడు కేసుల నుండి తప్పించుకోవడానికి ట్రై చేయలేదని… తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా ఎదుర్కొంటున్నాడని.. మీఎల్లో గ్యాంగ్ లాగా అడ్డంగా బుక్ అయ్యి.. భయపడి స్టేలు తెచ్చుకోలేదని సోషల్ మీడియాలో వైసీపీ సైన్యం రఫ్పాడిస్తున్నారు.
see also : ఇక డిజిటల్ పాలన.. ప్రగతిభవన్, సచివాలయం నుంచే వీక్షణ..!